ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన ఎక్కువ సేపు తెలంగాణ రాజకీయాలపైనే దృష్టి సారించారు. అమరావతిలో మరోసారి పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపి, కాంగ్రెస్‌తో పొత్తుపై సంకేతాలిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అవసరమైతే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాల్సివస్తుందని ఈ విధంగా ప్రచారం ప్రారంభించాలని పార్టీ నేతలకు చంద్రబాబు తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం కోసమే ఆయన శనివారం హైదరాబాద్ వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతుండగా టీడీపీ కాంగ్రెస్ పొత్తు చారిత్రాత్మక తప్పిదమంటూ అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోకుండా, పాలన సక్రమంగా సమగ్రంగా లేకపోయినా కేంద్రంపై పోరాటం అని, కర్ణాటకలో రాజకీయాలు, టీడీపీ భూస్థాపితం అయిన పక్కరాష్ట్రం తెలంగాణలోనూ రాజకీయాలు చేసేందుకు వెంపర్లాడడం చూసి ఏపీ ప్రజలు చంద్రబాబు తీరును విమర్శిస్తున్నారు.