కొండా సురేఖ చేసిన వాఖ్యాల పై వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ స్పందించి ఆమె కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు. కొండా దంపతుల ప్రవర్తన గురించి వరంగల్ నగర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాతీర్పుకు కొండా సురేఖ సిద్ధంగా ఉండాలి. ప్రజలు సరైన తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరికెంత బలం ఉందో ఎన్నికల్లో తేల్చుకుందాం అని సురేఖకు నరేందర్ సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ మాకు పుట్టినిల్లు. ప్రజా బలం ఉంటే కొండా ఫ్యామిలీ మూడు నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా పోటీ చేయాలి. మధుసూదనాచారి ప్రజల్లో లేరు అని చెప్పడానికి కొండా సురేఖ ఎవరు? ఉద్యమానికి వీసమెత్తు పని చేయకున్నా టికెట్ ఇచ్చిన గొప్ప మనసు కేసీఆర్‌ది అని నరేందర్ తెలిపారు.
