కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారో చెప్పాలంటూ నానా యాగీ చేసిన వాళ్లే.. ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించారంటే ముందస్తు పై ఎవరికి మక్కువ ఎక్కువన్నది తేలిపోయింది. తాము అధికారంలోకి వస్తే రాష్ర్టానికి ఏదో చేస్తామని ప్రకటించిన ఉత్తమ్‌కుమార్ మాటలన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే ఉంటే.. చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. నాడు మహాభారతంలో ఉత్త ర కుమారుడు..గవాధ్యక్షా! నేను టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేసి అధికారాన్ని క్షణంలో చేజిక్కించుకుంటాను. కానీ.. నాకు తగిన
సమయం రాలేదు కదా. తగిన సమయం దొరికితే టీఆర్‌ఎస్ పార్టీని జయించడం ఎంతపని. వెంటనే మ్యానిఫెస్టో ప్రకటనకు అనుమతివ్వండి అన్నాడు.పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వరకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తుండగా.. మిగతావి ఆచరణలో పెట్టలేని పరిస్థితి. తొలి నుంచి అవినీతికి అలవాటుపడిన కాంగ్రెస్ నేతలకు అయితే ఆచరణకు సాధ్యం కానివి లేదంటే కాపీ కొట్టే పథకాలే ఆలోచనలోకి వస్తాయి. ఉత్తమ్ కొత్తగా ప్రకటించిన ప్రతి పథకంలోనూ లోటుపాట్లున్నాయి. కనీసం బడ్జెట్ పై ఏమాత్రం అవగాహన లేకుండా.. ఆదాయ వ్యయాలు లెక్కించకుండా.. ఇప్పటికే అమలవుతు న్న పథకాలకు అవుతున్న ఖర్చులను బేరీజు వేయకుండా ప్రకటించిన పథకాలు కాంగ్రెస్‌ను ముంచేవే.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 2.74 కోట్ల మందిని పేదవారిగా గుర్తించి తెల్ల రేషన్‌కార్డుల ద్వారా వారికి సరుకులు అందిస్తున్నది. కిలో ఒక్కరూపాయి చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరలకే అందిస్తున్నది. అయితే.. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని కాంగ్రెస్ చెబు తున్నది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర సుమారు కిలో రూ.35 పలుకుతున్నది. నెలకు ఒక లబ్ధిదారుడిపై ప్రభుత్వం చేసే ఖర్చు రూ.245 అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి 2.74 కోట్ల మందికి ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కేవలం రేషన్ బియ్యం కోస మే ఏడాదికి రూ.8 వేల కోట్లకు పైగా నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?ఇండ్ల పథకం కింద ఇప్పటివరకు లబ్ధి చేకూరని వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల రుణాలు ఇప్పిస్తామని ప్రకటించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తున్నది. అలాంటప్పుడు కాంగ్రెస్ రుణాలు ఇప్పించి ఇండ్లు కట్టిస్తే పేదవారిపై అది భారమే కదా. ఇప్పటికే ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించుకున్నవారికి అదనపు గది కోసం రూ.2 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ.. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు నిర్మించినట్లు లెక్కల్లో పేర్కొన్న కాంగ్రెస్ ప్రభు త్వం అందుకోసం రూ.7,168 కోట్లను వెచ్చించింది. ఈ ఇండ్ల నిర్మాణం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రూ.200 కోట్లు, రాజీ వ్ గృహకల్పలో రూ.158 కోట్ల వరకు నాయకులు వెనుకేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పుడు మళ్లీ అవే ఇండ్లకు మరో రూ.2 లక్షలు చొప్పున మంజూరు చేస్తామనడం, బిల్లులు రానివారికి బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడం అవినీతిని ప్రోత్సహించడమే అవుతుంది.
బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. సబ్సిడీ మినహాయిస్తే ప్రస్తుతం ఒక్క సిలిండర్ ధర రూ.510. రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు ఏడాదికి 6 ఉచి త సిలిండర్ల చొప్పున అందించాలంటే ఏడాదికి అయ్యే ఖర్చు రూ.2,448 కోట్లు. పింఛన్ల విషయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి ప్రకటనే చేసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన 43 లక్షల మందికి పిం ఛన్ల కోసం ఏడాదికి రూ.5,600 కోట్లు ఖర్చు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని డబుల్ చేస్తే రూ. 11,200 కోట్లు కేటాయించాలి.రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ ఇస్తామని ప్రకటించారు. అసలు నిరుద్యోగులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు ? మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లు, ఆపై చదివింది కేవలం 10 లక్షల మందేనా? కొన్ని ప్రభుత్వ శాఖల్లో టెన్త్, ఇంటర్‌తో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. అంటే.. టెన్ పూర్తయిన వాళ్లు కూడా నిరుద్యోగుల కిందకే వస్తారు. అలాంటప్పు డు 10 లక్షల మందిని మాత్రమే నిరుద్యోగులుగా ఎలా గుర్తిస్తారు? పైగా.. పింఛన్లు రెట్టింపు చేస్తామన్న హామీతో రాష్ట్రంలోని వికలాంగులకు రూ.3 వేల పింఛన్ వస్తుంది. అంటే నిరుద్యోగులకు ఇచ్చే భృతి, వికలాంగులకు పింఛన్ ఒకే స్థాయిలో ఇస్తారా ? ఈ లెక్కన అది నిరుద్యోగులకు అందించే పింఛన్‌గా పరిగణించాలా?
ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతుంది. దాన్నిబట్టే పథకాల అమలు ముందుకు సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగ డం వల్లే బడ్జెట్ కేటాయింపులను సమతూకంతో వేసి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. కానీ.. కాంగ్రెస్ ప్రాథమికంగా ప్రకటించిన కేవలం మూడు పథకాలకే రూ.22 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. బడ్జెట్లో 22 వేల కోట్లు మూడు పథకాలకే కేటాయిస్తే.. మిగతా పథకాల పరిస్థితేంటి? వాటికి కేటాయింపులు ఎలా జరుపుతారు? అతిముఖ్యమైన సాగు, తాగునీటి రంగాల వంటి వాటికి సమన్వయం ఎలా జరుగుతుం ది? కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధుల పరిస్థితి ఏంటి ? కేవలం ఇవే కాదు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో 465 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. వీటన్నింటికి నిధులు ఎలా
సమకూరుస్తారు. ఒకవేళ వాటిని ఆపేస్తే ఇప్పటివరకు లబ్ధిపొందుతున్న వారు నష్టపోవాల్సిందేనా..? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్బాలు.. ఉత్తుత్తి హామీలు.