తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం అవడంతో జ్యోతిష్కులకు కూడా గిరాకి పెరిగింది. వారు చేసే వ్యాఖ్యలకు ప్రాదాన్యత వస్తోంది.తాజాగా ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణరావు ఈ విషయమై స్పందించారు. తెలంగాణలో కేసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. ‘కేసిఆర్ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడుగా చంద్రుడు, రాహువు, కేతువు అనుకూల యోగాన్ని చూపుతున్నాయని అందువల్ల కేసిఆర్ కు మహాయోగం ఉందని ఆయన అంటున్నారు. ఈ జాతకం విక్రమార్కచక్రవర్తి జాతకం. ఇటువంటి జాతకం వంద కోట్ల మందిలో ఒక్కరికే ఉంటుంది’ అని ఒక పత్రికకు వివరించారు.2009 లో తానే తెలంగాణ భవన్ లో చండీయాగం నిర్వహించానని కూడా ఆయన అంటున్నారు.కేసిఆర్ చండీయాగంలో రాజయోగం వచ్చింది అన్నారు.‘కొన్ని దైవ ప్రక్రియలు నిర్వహిస్తే భవిష్యత్ ప్రధాని ఆయనే. ఈ గ్రహస్ధితి ఉన్నవారు చక్రవర్తి అవుతారని కూడా రమణరావు చెబుతున్నారు.
