కొండా దంపతులకు వరంగల్ టీఆర్ ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీతో రహస్య అజెండా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌లో కొండా చేరికపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే చెప్పారని.. పార్టీలో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కార్యకర్తల మధ్య చీలిక తెచ్చే విధంగా కొండా దంపతులు ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కొండా దంపతులకు రాజకీయ జీవితం ప్రసాదించారని.. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని చెప్పారు.ఈ సందర్బంగా కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతోనే కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
