యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకే టికెట్ కేటాయిస్తారంటూ అనుచరగణంతో దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైస మ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇదిలావుండగా పీసీసీ అధికార ప్రతినిధి నారబోయిన రవి కూడా తనను అభ్యర్థిగా ప్రకటిస్తుందంటూ చెప్పుకుంటున్నారు. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరిని వరిస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరును చూసి విద్యావంతులు, మేధావులు, సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వర్గ పోరుతో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారనున్నదని పలువురు భావిస్తున్నారు.ఇలా ఎవరికి వారు వేర్వేరుగా సమాచారం చేసుకుంటూ ఆ నియోజకవర్గ పట్టుని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుస్తున్నారు.మరోవైపు కేసీఆర్ వ్యూహాలకు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు బెమ్బెలేత్తుతున్నారు.