తెలంగాణలో భూస్థాపితం అయిన తెలుగుదేశంపార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లనుందన్న విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశమవగా ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తెలంగాణలో బ్రతికే ఉందని, మొత్తం సమూల మార్పులకు శ్రీకారం చుడదామని, మొత్తం అభ్యర్ధుల ఎంపిక చేద్దామని, పార్టీకోసం పనిచేసేవాళ్లు, ఉత్సాహికులకు ఎంపిక చేద్దామని చెప్పారట.. దీంతో వెంటనే ఎల్ రమణ సార్ ముందుగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 31జిల్లాలకు ఇన్ చార్జులను, జిల్లా అధ్యక్షులను పెడదాం,, తర్వాత కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంతో సార్వత్రిక ఎన్నికలు సంబంధించిన పనులు చూద్దాం అనడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందట..
ఎప్పుడూ అవకాశాలకోసం ఎదురు చూసే చంద్రబాబు సాయాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంతో టీడీపీలో జవసత్తువలు నింపేసి పార్టీ జాతీయ అద్యక్షుడి హోదాలో చంద్రబాబు పార్టీని పట్టాలెక్కించేద్దామంటే చెప్పిన కాకి లెక్కలకు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అయితే ముందుగా పాత జిల్లాల్లో ఇప్పుడున్న నాయకత్వాన్ని మార్చి కొత్తజిల్లాల ప్రకారం ప్రక్షాళనకు పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.