ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఉనికి నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. కాంగ్రెస్ తో సొత్తుపై మరో 24గంటల్లో క్లారిటీ రానున్న నేపధ్యంలో ముందుగా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుదామని అందరినోటా చెప్పించారు.
ఇదే ఊపుతో పార్టీ కార్యకర్త ఒకరు శంఖం తీసుకొచ్చి చంద్రబాబు చేతికిచ్చారు. అంతే ఇక చంద్రబాబు శంఖాన్ని ఊదేందుకు సిద్ధమయ్యారు. దీంతో పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు అన్నారు” దీంతో ఒక్కసారిగా శంఖాన్ని నోట్లో పెట్టుకున్న చంద్రబాబుకు భయం పుట్టుకొచ్చిందో ఏమో నోట్లో పెట్టుకున్న శంఖాన్ని తీసి రమణకు ఇచ్చి ఊదించారు. అయితే ఓవైపు కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు అపారమైన తెలివితేటలు, అనుభవంతో అందరి కలిసి కేసీఆర్ సర్కార్ మళ్లీ రాకుండా చేయాలనుకుంటుంటే కనీసం ఆపేరెత్తితేనే చంద్రబాబు భయపడడంతో ఇరు పార్టీలూ నవ్వులపాలవుతున్నాయి.