తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు -AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీయారే మరోమారు సీఎం అవుతారని అసద్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆరెస్ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు ఆశ లేదన్న అసదుద్దీన్.. మైనారిటీలు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసమే తమ ఎజెండా అన్నారు. అందుకే టీఆరెస్ కు మద్దతు తెలుపుతున్నామన్నారు. అటు..
తాము పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అని చెప్పుకుంటున్న టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని అసదుద్దీన్ ప్రశఅనించారు. కాంగ్రెస్ టీడీపీ అనైతిక పొత్తును ప్రజలు తిప్పుకొట్టడం ఖాయమన్నారు అసదుద్దీన్.
