కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీస్థాయిలో ప్రజలను సమీకరించి వారి ముందు గత నాలుగేండ్ల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రగతి నివేదన సభలో సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో కేసీఆర్ ప్రకటించగానే ప్రతిపక్షలకు దిమ్మతిరిగినట్టు అయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంది. అందరి చూపు తెలంగాణ వైపు తిప్పుకుంది. అందుకు కారణాలు కూడ అందరికి తెలుసు..ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. గొప్ప పాలన అందించారు. ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాను వదిలేలోగా, కేసీఆర్ పొలిటికల్ ప్రచారం చాలా దూరం వెళ్లిపోతుంది. పైగా నవంబర్ లో ఎన్నికలు అంటున్నారు కేసీఆర్. అంటే ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం అని అర్థం అవుతున్నది. ఈలోగా ప్రతిపక్షాలు అభ్యర్థులను చూసుకోవాలి. ఆర్థిక అండదండలు సమకూర్చుకోవాలి. కేసీఆర్ దాదాపు ఊపరి ఆడనంత పని చేశారని ఇప్పటికే తెలుస్తుంది. అపార రాజకీయ అనుభవం వున్న కేసీఆర్ కు తెలియని సంగతులు కావు. అయినా ఇలా ప్రకటించారు అంటే ఆయన తెగువ మెచ్చుకోదగ్గదే. ఆ తరహా పరిస్థితిని క్రియేట్ చేసి, రాజకీయ చదరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ తీసుకున్న మరో తెగింపు నిర్ణయం ఏమిటంటే, దాదాపుగా సిట్టింగ్ లు అందరికీ టికెట్ లు మళ్లీ కేటాయించడం. ఇది కూడా ఆశ్చర్యకరమే.
