టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఆయన మండిపడ్డారు. అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.