ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సిబ్బంది, బడ్జెట్, శాంతిభద్రతలు వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఖరారు చేస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా వెల్లడైన తర్వాతనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. రజత్‌కుమార్‌ను ఢిల్లీకి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఒకవేళ కేంద్రం ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తే ముందస్తుకు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది.