టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కూడా అదే బాటలో నడిచింది. జిల్లాల వారీగా కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నలుగురు అభ్యర్థులను ప్రకటించారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక నేత గాదె ఇన్నయ్య చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్, మహబూబాబాద్‌కు అభినందన, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చింతా స్వామిలను తమ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు. కాగా… వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం
