తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని మొత్తం నూట ఐదు స్థానాలల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు,అంధోల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు అయిన బాబుమోహాన్ కు ఈ సారి అవకాశమివ్వలేదు..
దీంతో వీరిద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో గులాబీ అధినేత కేసీఆర్ బేగంపేట్ లోని సీఎంఓకి పిలిపించుకున్నారు. అందులో భాగంగా మీ భవిష్యత్తుకు నా భరోసా.. మీరు నన్ను నమ్మండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. మీకు తప్పకుండా న్యాయం చేస్తాను .అందరూ కల్సి పనిచేయండి.. రానున్న ఎన్నికల్లో అధికారం చెపట్టిన కొద్ది రోజుల్లోనే మీకు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు అని సమాచారం..