తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది కాంగ్రెస్‌కు చిత్తు కాగితంలాందని విమర్శించారు. తెలంగాణలో తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈటెల చెప్పుకొచ్చారు. ఇంకా అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
