రాష్ట్ర ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా పురుషోత్తమరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు వైసీపీనేతలు తెలిపారు. పురుషోత్తమరెడ్డి మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. కాగా జగన్ కుటుంబసభ్యులు పులివెందులకు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఆయనకు వైయస్ విజయమ్మ, షర్మిల, భారతి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డిలు నివాళులు అర్పించారు. అయితే పురుషోత్తమ రెడ్డితో వైఎస్సార్ కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వైఎస్ ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ రాజకీయాలు నేర్పించడంలో ఆయన పాత్ర కూడా ఉంది. కాగా వైఎస్ కుటుంబ సభ్యుడు చనిపోవడం పట్ల ఆప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.
