అనంతపురంలోజిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై పరిటాల అనుచరులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేయడంపై ప్రసాద్ రెడ్డి సోదరుడు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహానందరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి పరిటాల సునీత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన అన్నను చంపినట్టే తననూ హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన భూమిలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మహానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.