చంద్రబాబు పై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో,త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో వనుకుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యంలో లోటు అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.