కేరళకు చెందిన మోహన్ అనే ఓ బిచ్చగాడు సోషల్ మీడియాలో ప్రశంసలుపొందుతున్నాడు. బిచ్చమేత్తుకుంటూ తాను సేకరించిన మొత్తం లో రూ.94 కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు.కొట్టయానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రషీద్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలనుకున్నాడు.అయితే అతడిని చూసిన రషీద్ 20రూపాయలు బిచ్చంగా ఇవ్వడం జరిగింది.అతడిచ్చిన డబ్బుని తిరస్కరించి,తనవద్ద ఉన్న రూ.94 సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపమని కోరాడు.ఇతడి గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది.