తాజాగా ఇటీవల గిరిజన తండాల్లో జ్వరాలు ప్రబలి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు లేకపోవడం, అపారిశుద్ధ్యం పేరుకుపోవడంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జ్వరానికి ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటంతో సకాలంలో గుర్తించలేక మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఈ మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పుష్కశ్రీ వాణిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరికలు చేయడమే గాకుండా ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తామని తెగేసి చెప్పడంతో అధికారులు కాస్త చలించినా జ్వరాలను నిర్మూలించే చర్యలు చేపట్టలేదు. తూతూమంత్రంగా వైద్యం చేసారు. అసలు జ్వరాలకు అసలు కారణం వైద్యాధికారులు చెప్పకపోవడంతో చేసేది లేక, పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వైద్యం చేయించుకోలేక మళ్లీ గిరిజనులు భూతవైద్యుల బాటపడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, జిల్లామంత్రులు చిన్నారుల చావులను చూసి కూడా స్పందించకపోవడం దారుణం. కనీసం వైద్యం అందించకుండా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై గిరిజనులు ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు, ధఱ్మపోరాటదీక్షలకు కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని, ఆయనకు అడవి తల్లి బిడ్డల ఉసురు తగులుతుందని ఆగ్రహిస్తున్నారు.