Home / 18+ / పీవీఎల్ కు పట్టం కడతారా.? శివను మళ్లీ గెలిపిస్తారా.? జనసేన బలపడితే పీవీఎల్ కే లాభమా.?

పీవీఎల్ కు పట్టం కడతారా.? శివను మళ్లీ గెలిపిస్తారా.? జనసేన బలపడితే పీవీఎల్ కే లాభమా.?

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2004లో వైఎస్సార్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్ధి పాతపాటి సర్రాజు గెలిచారు. 2004లో అప్పటికే ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు)ను సర్రాజు ఓడించారు.. అనంతరం 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన వేటుకూరి వెంకట శివరామరాజు(శివ) కాంగ్రెస్ అభ్యర్ధి సర్రాజుపై గెలిచారు. అలాగే 2014లో సర్రాజు వైఎస్సార్సీపీ తరపున బరిలోకి దిగినా సర్రాజే గెలిచారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ క్షత్రియ సామాజికవర్గంనుంచి తనకు ఈసారి మంత్రిపదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నా ఆయనకు కాదని వైసీపీనుంచి ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు ఆపదవి ఇచ్చారు. దీంతో ఆయన అలకబూనినా జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. ఈయన ఎక్కువగా జిమ్మిక్కులతో కాలం వెళ్లదీస్తారనే ఆరోపణలున్నాయి. మీడియా పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి కూడా ఈయనగారికి ఎక్కువేనట.. గత సమైక్యాంధ్రి ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే రాజీనామా చేస్తానని ప్రకటించి రాజీనామా చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాదిరిగా పంటకాలువలో జలదీక్ష, మోకాళ్లపై రక్తం కారేలా నడవడం.. చొక్కా లేకుండా రోడ్డుమీద నిద్రించడం.. బనియన్ ధరించి సెంటర్ లో ఉప్పుఅమ్ముకోవడం.. వంటి పబ్లిసిటీ స్టంట్ లు చేశారు. ఆసమయంలో ఈయనను చూసి అప్పట్లో నియోజకవర్గ ప్రజలే నవ్వుకున్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో జరిగిన గరగపర్రు ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.. గరగపర్రు వెళ్లిన శివను దళితలు నిలదీసారు. ఈఘటన శివకు బాగా నష్టం కలిగించనుందని చెప్పుకోవచ్చు. గతంలోనూ ఈయ న దళితుడిపై చేయి చేసుకున్నారని, ఈయన కారుకు అడ్డం పడిన దళిత నాయకుల కాళ్లపై కారు ఎక్కించారనే వాదనలున్నాయి. దీంతో దళితుల ఓట్లు శివకు పూర్తిగా దూరమయ్యాయి.. మరోవైపు నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపులుకూడా బీసీల్లో చేర్చుతామని ఏమార్చడంపై తమ సత్తా చూపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకత పవనాలు వీస్తుండడంతో శివ తెలివిగా వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తన మంత్రిపదవికి బదులు ఏలూరు సమీపంలో వెయ్యికోట్లు టర్నోవర్ చేసే ఓ వ్యాపారానికి 200ఎకరాలు భూమిని శివకు దారాదత్తం చేసారట. ఆకివీడు, పాలకోడేరు, కాళ్ల, ఉండి ఈ నాలుగు మండలాల్లో కాళ్లలో మాత్రమే టీడీపీకి కాస్తో కూస్తో పట్టు ఉందని, మిగిలిన మూడు మండలాల్లో వైసీపీ ప్రభంజనం వీస్తోంది. నియోజకవర్గంలో సరైన తాగునీటి వ్యవస్థ లేదు. ఆకినీడులో సరైన డ్రైన్లేజీ వ్యవస్థ లేదు. మురుగునీటి పరిస్థితి అత్యంత దారుణంగా కాసేపు వర్షం పడినా రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. సిద్దాపురం, కలిదిండి, పాలకోడేరు, యండగండి, వెళ్లే రోడ్డు అద్వాన్నంగా ఉన్నాయి. ట్రాఫిక్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. రోడ్ల వెడల్పు, ఆర్వోబీల నిర్మాణం జరగట్లేదు. రెండుసార్లు శివను గెలిపించినా పరిస్థితి బాలేదు. ఆకివీడు, ఉండి, కాళ్లలో బస్టాండులున్నా నిర్వహణ బాలేదు. ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు ఏ సమస్యను చెప్పినా పట్టించుకోవట్లేదు. కనీసం ఎమ్మెల్యే సొంత గ్రామంలో కూడా రోడ్లు, డ్రైన్లు బాలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దళితవాడలవైపు అసలు కన్నెత్తి చూసే ప్రసక్తే లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరోవైపు ఉండి నియోజకవర్గ అభ్యర్ధి పీవీఎల్ నరసింహరాజు దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై పీవీఎల్‌ సింహంలా దూకారు.. ముందుగా మంచి ప్రచారరథాన్ని తయారు చేయించుకుని తీసుకువెళ్లారు. వైసీపీకి రాష్ట్రంలో వెళ్లిన మొదటివాహనం ఇదే. అనంతపురం పాదయాత్రలో ఉన్న జగన్‌ ధర్మవరంలో దీన్ని ప్రారంభించారు. దీంతో వైసీపీ గెలిచే మొదటిసీటు కూడా ఇదే అంటున్నారు వైసీపీ శ్రేణులు. పీవీఎల్ కు బాధ్యతలు అప్పగించిన కొద్దిరోజులకే నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందనే ఆశలు పెరిగిపోయాయి. పార్టీ శ్రేణులెవ్వరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదంటూ దూసుకెళ్తున్నారు. పీవీఎల్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం కూడా మంచి సహకారం అందిస్తోంది. తాజాగా ఉండి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో పెద్దఎత్తున భారీ జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పీవీఎల్ కూడా అందరినీ కలుపుగోలుగా వెళ్తున్నారు. కార్యకర్తలతో మమేకమవుతూ మీతోనే నా జీవిత కాల ప్రయాణం అంటూ ముందుకెళ్తున్నారు. గడపగడపకూ వైఎస్సార్సీపీ, పల్లెనిద్ర కార్యక్రమాలను విజయవంతం చేసారు. తాజాగా బూత్ కమిటీలు కూడా వేసి పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర జోష్ తో పనిచేస్తున్నారు. శివమాటలు తప్ప పనులు చేయించకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై వ్యతిరేకత, నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయకపోవడంతోపాటు పీవీఎల్ జోష్, వైసీపీ మానియా, నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్న ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన ఇక్కడ ప్రభావం చూపినా గెలుపు ఓటములను డిసైడ్ చేసేంత ప్రభావం కనిపించట్లేదు. అలాగే జనసేన ఓట్లు చీలితే గతంలో పవన్ మాట విని టీడీపీకి వేసారు కాబట్టి ఈసారి ఆరెండు పార్టీల ఓట్లు చీలి పీవీఎల్ గెలుపునకు జనసేన ఉపయోగపడనుంది. మొత్తమ్మీద ఉండి గడ్డపై 2019లో పీవీఎల్ భారీ మెజారిటీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగురవేస్తున్నారనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat