రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. గత ఏడాది నుంచి రాఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి జర్నలిస్టులు వా లోన్, క్వా సూ ఓలు అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగిన కేసులో.. వీళ్ళకు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్ కాలం నాటి అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ఉల్లంఘించారనికేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తమను అన్యాయంగా ఇరికించారని ఆ ఇద్దరూ ఆరోపిస్తున్నారు.
