ఓఎమ్మెల్యే పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ ప్రముఖుల సమక్షంలో పెళ్లిపీటలపై ఎమ్మెల్యేతో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు ప్రేమికుడితో వెళ్లిపోవడం తీవ్ర సంచలనాలకు దారి తీసింది. ఇదంతా తమిళనాడులో జరిగింది. దీంతో ఆ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు బాధపడ్డారు. ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ అనే 43ఏళ్ల ఎమ్మెల్యే ఉక్కరం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల సంధ్యకు తాజాగా నిశ్చితార్ధం జరిగింది. అయితే ఈనెల12న వీరి వివాహం జరగాల్సివుంది. ఊరాంతా పెళ్లిపత్రికలు పంచి, పెళ్లి ఏర్పాట్లలో అంతా తలమునకలయ్యారు. ఈవివాహనికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు హాజరవ్వనున్నారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 11గంటలకు సంధ్య సత్యమంగళంలో ఉన్న తన సోదరిని చూసి సాయంత్రానికల్లా తిరిగి వస్తానని కుటుంబీకులకు చెప్పి వెళ్లింది.
ఆరోజు రాత్రికి కూడా ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులంతా కలవరపడ్డారు. రెండురోజులుగా ఆమె ఆచూకీ కోసం అన్నిచోట్లా వెదికినా జాడ తెలియలేదు. దీనితో సంధ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసు విచారణలో విగ్నేష్ అనే యువకుడిని రెండేళ్లుగా ప్రేమించిందని, ఈ విషయం తెలిసిన కుటుంబీకులు ఎమ్మెల్యేతో పెళ్లి కుదిర్చినట్టు తెలిసింది. ఇష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో వెళ్లిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి సంధ్య ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికీ వీరి ఆచూకీ తెలియరాలేదు.
Tags mla marriage tamil nadu