విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నా ఆత్మశాంతి కోసం చివరి కోరిక నువ్వు నన్ను చూడటానికి రావాలి.. నీచేతులమీదగా నా అంత్యక్రియలు చేయాలి. నిన్ను బ్రతికివుండగా చూడలేకపోయాను తప్పక చనిపోతున్నా.. నువ్వు వస్తావ్ అని ఆశిస్తున్నా.. నీ పిచ్చి అభిమాని అనిల్ అంటూ రాసి చనిపోయాడు.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
