ఏపీలో జరగబోయో సాధరణ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. వైఎస్ జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి విశ్వాసం లేదన్నారు. విభజన హామీలు మోదీ నెరవేర్చకపోయినా.. వైసీపీ మాత్రం వారితో చీకటి ఒప్పందం చేసుకుని ముందుకెళ్తోందన్నారు.
