ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్‌గా ఉన్నా చంద్రబాబుని గెలిపించారు.అయితే నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.పోలవరం ఏదో సాధించామని చెప్పుకుట్టున్నా పోలవరంలో ఇప్పటికీ 50 శాతం పనులు కూడా చేయలేకపోయారు. పట్టిసీమతో తూ తూ మంత్రంగా ప్రకాశం బ్యారేజీకి వాటర్ తరలించి పబ్బం గడిపేసుకున్నారు. రాజధాని నిర్మాణ పనులు, రహదారులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇప్పటి వరకు న్యూట్రల్‌గా ఉన్న పలుగురు సీనియర్ రాజకీయ నాయుకులు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సీనియర్లతో పాటు టీడీపీలో ఉన్న సీనియర్లు సైతం వైసీపీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నారు.ఇటు చంద్రబాబుపై ఏపీ జనాల్లో క్రమక్రమంగా నమ్మకం తగ్గుతుండడం అటు కొత్తగా జనసేన ఎన్నికలకు రెడీ అవుతున్నా పవన్‌కళ్యాణ్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేకపోవడంతో ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.
మరోవైపు ఇంతకాలం టీడీపీలో ఉన్న ఆనం వంటి కొందరు నేతలు జగన్ పార్టీలో చేరుతుండగా, వైఎస్సార్ సన్నిహితులు, శిష్యులు ఆయన రాజకీయ భిక్షతో ఎదిగిన నేతలంతా గత ఎన్నికల్లో స్థబ్దుగా ఉన్న నాయకులంతా ఈషారి జగన్ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది వైసీపీకి అదనపు బలంగా తెలుస్తోంది.మరోవైపు కాంగ్రెస్ తో కలుస్తుండడం పట్ల ఈ కలయిక నచ్చని ఇరుపార్టీల నేతలు జగన్ కే జై కొడుతున్నారు. గతేడాది టీడీపీకి ఓటువేసిన జనసేన అభిమానులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. జనసేనకు వేయాలా వైసీపీకి వేయాలా అని ఆలోచిస్తున్నారు. పరిస్థితిని బట్టి జనసేన ఓటింగ్ క్యాండిడేట్లను బట్టి చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.