తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కె టి ఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు.
మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. వైష్ణవి తో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్ తో సెల్ఫీ లు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడు ని అని, కీలక శాఖల మంత్రి ని అనే అధికార దర్పం ప్రదర్శించ కుండా సామాన్యుడి ల వ్యవహరించిన కేటీఆర్ తీరు ప్రశంసల కు కారణం అయ్యింది.