గత ఎనిమిదేళ్లుగా ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించని సీఎం చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వైయస్ కి ఘననివాళి అని ట్వీట్ పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో ఎలాగూ కలిసి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటినుండే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలన అద్భుతమని, వైయస్ పథకాలని తిరిగి తీసుకోని రావాలంటే మళ్ళీ తనకే ఓటేయాలని తామిద్దరం మంచి మిత్రులమని జగన్ వల్ల వైయస్ చాలా ఇబ్బందులు పడ్డాడని , ఆ విషయాలన్నీ వైయస్ నాతో చెప్పి బాధపడేవాడని, కాబట్టి వైయస్ పాలన మళ్ళీ రావాలంటే మరోసారి నన్ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు కోరతారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. వైయస్ మీదున్న గౌరవంతోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నానంటూ చంద్రబాబు ప్రజలను నమ్మించినా ఆశ్చర్యం లేదంటున్నారు. లేకపోతే ఎనిమిదేళ్లుగా లేనిది తాజాగా కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లాక ఆపార్టీ నాయకుడు(చనిపోయేనాటికి కాంగ్రెస్ సీఎం) అయిన వైఎస్ కు నివాళులర్పించడం అంటే ఇదే అంటున్నారు. ప్రజలని ఎన్ని రకాలుగానైనా నమ్మించి వంచించగల నేర్పరితనం చంద్రబాబు వద్ద ఉన్నా ఈసారి చంద్రబాబు ఎటువంటి మాటలు చెప్పినా ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.