భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈవ్ టీజింగ్‌కు గురైందా.. దీనికి కారణం ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ అని తెలుస్తుంది, ఎందుకంటే స్వయంగా ఆమె భర్త, షోయబ్ మాలిక్ ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. విషయంలోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు షోయబ్‌తో పాటు సానియా కూడా ఢాకా వెళ్లింది. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న సానియాను బంగ్లా క్రికెటర్ షబ్బీర్ రహమాన్ అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో షోయబ్ మాలిక్ అప్పట్లోనే ఢాకా మెట్రోపొలిస్ క్రికెట్ కమిటీ కి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు మరలా సానియాపై వివాస్పద వ్యాక్యాలు చేసాడు. ఇదిలావుండగా గతేడాది ఓ అభిమానిపై దాడికి దిగిన షబ్బీర్… ఇటీవల ఫేస్‌బుక్‌లోనూ ఓ అభిమానిని దుర్భాషలాడి బెదిరించాడు. దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ అతడిపై ఆరు నెలల నిషేధం విధించగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్నాడు.