అధికార టీఆర్ఎస్ పార్టీ తన దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్‌లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మరో భారీ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు పలు అంశాలపై చర్చించారు. ‘ప్రజల ఆశీర్వాద సభ’ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈనెల 7 న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో జరుగు సీ ఎం కేసీఆర్ హాజరయ్యే భారీ సభకు 65 వేల మందిని సమీకరించాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం నుండి 15 వేలు, ఎల్కతుర్తి నుండి 6 వేలు, భీమదేవరపల్లి నుండి 10 వేలు, అక్కన్నపేట్ మండలం నుండి 10 వేలు, కోహెడ మండలం నుండి 10 వేలు, సైదాపూర్ మండలం నుండి 10 వేలు, చిగురుమామిడి మండలం నుండి 6 వేల మందిని సభకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రులు కోరారు. కాగా సభను జయప్రదం చేసేందుకు చిగురుమామిడి మండలానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, అక్కన్నపేట్ కు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, భీమదేవరపల్లి కి ఎమ్మెల్యే పుట్ట మధు, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి, ఎల్కతుర్తి కి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, హుస్నాబాద్ టౌన్, రూరల్ కు నీటిపారుదల మార్కెటింగ్ శాఖామంత్రి హరీష్ రావు హరీష్ రావు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, పాతురి సుధాకర్‌రెడ్డి లు ఇంఛార్జి లుగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ వెల్లడించారు.హుస్నాబాద్లో మద్యాహ్నం 2 గంటల కు జరుగు బహిరంగ సభ కు హుస్నాబాద్ పట్టణ సమీపంలో ని పోతారం, పందిళ్ళ, కూచనపల్లి, మాలపల్లి, అరెపల్లి, హుస్నాబాద్ టౌన్, పోతారం, పొట్లపల్లి, కొండాపూర్, నాగారం, ఉమ్మాపూర్, గాంధీనగర్ తదితర గ్రామాల నుండి పాదయాత్ర ల ద్వారా రావాలని పిలుపునిచ్చారు. గిరిజన నృత్యాలు, మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Tags cm harish rao husnabad kavitha kcr ktr telangana