టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ పర జలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టడం శుభపరిణామమన్నారు. మహానేత హాయంలో ముస్లింలకు మేలు జరిగిందని, మీరు కూడా మహానేత మాదిరిగా తమకు సంక్షేమ పథకాలు అందించాలని ముస్లింలు కోరారు. వారికి వైయస్ జగన్ అండగా ఉంటానని భరోసా కల్పించారు. అల్లా సాక్షిగా జగన్ కు అండగా ఉంటామన్నారు. దివంగత మహానేత మాదిరిగా జగన్ ఆప్యాయంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు ముస్లింలకు అన్యాయం చేసాడని, ఒక్క ముస్లింకూడా మంత్రి పదవికి అర్హులు కారా అని ప్రశ్నించారు. ప్రతీసారి చంద్రబాబు హయాంలో ముస్లింలకు అన్యాయం జరుగుతోందన్నారు. నాలుగేళ్లుగా ఏమీ చేయకుండా దుబారా ఖర్చులతో నారా హమారా నిర్వహించారని.. జగన్ హమారా వైసీపీ హమారా అని నినదించారు.