ఏపీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరో వైపు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి. .నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుంది..దీంతో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందులో బాగాంగానే వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నాయకుడు రఘురాజు వైసీపీలో చేరడానికి రచించిన వ్యూహం మాత్రం ఇప్పుడు విజయనగరం జిల్లా, శృంగవరపు కోట నియోజకవర్గంలోని అధికారంలో ఉన్నటీడీపీ నాయకుల్లో ఆందోళన పెంచుతోంది. వైస్సార్ హయాంలో ఇదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ముప్ఫై వేల పైచిలుకు ఓట్లు సాధించిన ఘనత రఘురాజుది. పైగా బొత్స సత్యనారాయణతో సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈ నాయకుడు చాలా కాలంగా వైసీపీలో చేరడం కోసం బొత్స ద్వారా జగన్‌ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్‌ని మెప్పించి పార్టీలో చేరడం కోసం రఘురాజు రెడి అయినట్లు తెలుస్తుంది. శృంగవరపు కోట, వేపాడు మండలాల్లో రఘురాజుకి పూర్తి ఆధిక్యం ఉండడం ప్రత్యర్థులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇదే స్థాయిలో కష్టపడితే 2019 ఎన్నికల్లో వైసీపీకు ఘనవిజయం ఖాయమని సమచారం.