ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా అని అనుకొనే విధంగా తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెళ్లెళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ప్రగతి నివేదన సభకు ప్రతిపల్లెనుంచి జనం భారీగా తరలివెళ్లారు. వరంగల్ రూరల్ జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా ప్రజలు తరలివెళ్లారు. ప్రజలు టీఆర్‌ఎస్ సభకు తరలివెళ్లడంతో పల్లెలన్నీ ఖాళీఅయ్యాయి. విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, కోలాట బృందాలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొంగరకలాన్‌కు తరలివెళ్లారు. ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంగర కలాన్ నుంచి ఔటర్ మీదుగా వరంగల్ హైవేపై బీబీ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు నాలుగైదు లక్షల మంది ప్రగతి నివేదన సభకు రాలేకపోయారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తిగా జామ్ కావడంతో సభకు వచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నడుచుకుంటూనే సభకు తరలివెళ్లారు. దీంతో కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహాజనప్రభంజనాన్ని సృష్టించి టీఆర్‌ఎస్ కొంగరకలాన్ వేదికగా చరిత్రను తిరగరాసింది. వరంగల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయసభగా రికార్డుకెక్కగా 25 లక్షల మందితో ప్రగతి నివేదనసభను నిర్వహించి టీఆర్‌ఎస్ తన రికార్డును తానే తిరగరాసింది. దాదాపు రెండువేల ఎకరాలకు పైగా విశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభ మహాసంద్రాన్ని తలపించింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన లక్షల మంది జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంచనాలకు మించిన జనంతో ప్రగతి నివేదన సభ మహాప్రభంజనంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశలోనే కాదు.. దేశంలోనే ఇప్పటివరకు ఇంత జనంతో సభలు జరిగిన దాఖలాలు లేవు.
Home / 18+ / తన రికార్డును తానే తిరగరాసిన టీఆర్ ఎస్.. ప్రపంచంలో రెండో అతిపెద్ద రాజకీయ సభగా ప్రగతినివేదన
Tags kcr pragathi nivedhana sabha