తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ శాసనసభ రద్దుపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి,ఇలాంటి వార్తలు రాయడం సరికాదని తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.2018-19లో ఆర్థిక ప్రగతి 17.83 శాతంగా ఉందన్నకేసీఆర్, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 9.60 కోట్లు కాగా నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 1,980 కోట్లు అని తెలిపారు. నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని,పెన్షన్లు పెంచుకుందామని,మోదీని ఒప్పించి కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించుకున్నాం అని కేసీఆర్ చెప్పారు.కేసీఆరే సీఎం కాకపోతే స్థానికులకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా? అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వేస్తామన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకేం పథకాలు ప్రవేశపెడ్తామో చెప్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.ఇంకా మరెన్నో పథకాలను ప్రజల ముందుకు తెస్తామని ఆయన ప్రకటించారు.
