దివంగత నేత వైఎస్ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. ఫాదర్ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని,వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ పాదయాత్ర చేస్తూ మీ బిడ్డగా వస్తున్నారు, ఆశీర్వదించండి.తండ్రి ఆశయాలను, ఆయన మిగిల్చిపోయిన మంచి పనులను అన్నింటిని నెరవేరుస్తాడని,తప్పుడు రాజకీయాలను నిర్ములిస్తారని,తండ్రి మాదిరిగానే మాట తప్పడని విజయమ్మ అన్నారు.కార్యక్రమంలో కుమార్తె షర్మిల, కోడలు భారతి, మనుమరాళ్లు, బ్రదర్ అనిల్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు.