నాల్గవ టెస్టులో నాలుగో రోజున జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో కోహ్లి మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులు రెండో ఇన్నింగ్స్లో 58పరుగులు సాధించాడు. అతనికి తోడుగా అజింక్యా రహానే కూడా అర్థ సెంచరీ సాధించాడు, కాని మిగతా ప్లేయర్స్ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది.
