ఓవైపు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోయి భారీ ఓటమితో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఈయన ఇవేమీ పట్టనట్టు కొత్త వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, వయసుకూడా చూసుకోకుండా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తాజాగా రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఈమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు. నిమ్రత్ వయసు 36. ఓ ప్రరమోషన్ కార్యలక్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. అయితే రవిశాస్త్రికి గతంలోనే పెళ్లి అయ్యి సంతానం కూడా ఉంది. పదేళ్లుగా భార్య రితూకు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నాడు. ఈక్ర్మంలో కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వచ్చాయి. తాజాగా కొత్త ప్రేమాయణ రూమర్లుతో రవిశాస్త్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి.