వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని, గోపికల వేషధారణలతో ముపించారు. ఈ సందర్భంగా ఉట్టి ఉత్సవంలో జగన్ పాల్గొని చిన్నారుల చేత ఉట్టి కొట్టించారు. జగనన్న తమ గ్రామం వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపేట గ్రామస్తులు అన్నారు. జగన్ ను చూసేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. మరోవైపు ప్రజాసంకల్పయాత్రలో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు వైయస్ జగన్‌ను కలిశారు. పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 25వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఆమట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వైయస్ జగన్ చేతుల మీదగా ప్రారంభించారు. తమ నాయకుడు పండుగలను ఆనందంగా వచ్చే యేడాది ముఖ్యమంత్రి స్థానంలో జరుపుకుంటారని, సామాజిక, పర్యావరణ బాధ్యతగా మట్టి విగ్రహాలను పంపిణీచేయడం సంతోషకరమని పార్టీ శ్రేణులు వెల్లడించారు.
