దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. వైఎస్ జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ 252వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.
