ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, వాటిలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి.. ఆయా ఆర్టీలు చాలా సభలు, సమావేశాలు నిర్వహించాయి. కానీ.. ఈ స్థాయి మీటింగ్ ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదు. ప్రపంచంలోనే ఇంతవరకు జరగని సభ ఇది. ప్రగతి నివేదన సభ వేదిక మీద దాదాపు 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించనుంది. సభా వేదిక ముందు 16 గ్యాలరీలు ఉంటాయి. సభ చుట్టూ 50 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, టీఆర్‌ఎస్ చరిత్రను కళ్లకు కట్టేలా ఫోటో ఎగ్జిబిషన్, 30 అంబులెన్సులు, మెడికల్ క్యాంపులు, ప్రతీ పార్కింగ్ లాట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, ప్రధాన వేదిక వెనుక హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాక్టర్ల కోసం 9 భారీ పార్కింగ్ స్థలాలు, ఇతర వాహనాల కోసం 15 పార్కింగ్ లాట్లు, సభకు వచ్చే దారిలో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు ప్రత్యేక క్రేన్లు, సభ మొత్తం భారీ బ్యాడ్జ్‌లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, జెండాలతో సుందరంగా ముస్తాబులాంటి ఏర్పాట్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటొ గ్యాలరీ ఆకట్టుకుంటోంది.
