రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు.. ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపిస్తున్నారు. కళాకారులతో కలిసి కేటీఆర్ డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో.. అందుకనుగుణంగా కేటీఆర్ డోలును కొట్టారు. దీంతో సభలో ఉత్సాహంతో రెట్టింఐంది. మిగతా కార్యకర్తలంతా కేటీఆర్‌ను తమ భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. ఇక సభా ప్రాంగణంలో తిరుగుతూ కేటీఆర్ మహిళా కార్యకర్తలను పలుకరించారు. కార్యకర్తలను సమన్వయ పరుస్తూ సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభ రాష్ట్ర ప్రజలకు గుర్తుండి పోయే విధంగా నిర్వహిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇంత భారీస్థాయిలో ఇలాంటి సభ జరగలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా శ్రేణులను సమయత్తపర్చేందుకు సభ ఉపయోగపడుతుందన్నారు. తమ అంచనాలకు మించి ప్రగతి నివేదన సభ విజయవంతం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రగతినివేదన సభ ప్రాంగణమంతా జనజాతరను తలపిస్తుంది. రాష్ట్రమంతా ఓ పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం కొంగర కలాన్ సభకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Home / 18+ / ప్రగతి నివేదన సభలో డోలు వాయించిన కేటీఆర్.. ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్కోవాలని కార్యకర్తలకు సూచన
Tags kcr pragathi nivedhana sabha