దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.కర్నూల్ జిల్లా పత్తికొండలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంకా స్థానిక ప్రభుత్వాస్పత్రి నందు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి ,మండల కన్వీనర్ , జిల్లా నాయకులు మరియు వైయస్ఆర్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
