టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు యావత్ తెలంగాణ ప్రజలంతా స్వచ్చంధంగా చీమలదండులా కదిలి వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, యుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకున్నారు. చాలామంది యువ కార్యకర్తలు తమ ద్విచక్ర వాహనాలపై పార్టీ జెండాలను అలంకరించుకుని తరలివస్తున్నారు. ఈ కార్యకర్త ప్రగతి నివేదన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆ యువకునితో ముచ్చటించారు. సభా ప్రాంగణంలోని యువతతో కేటీఆర్ ముచ్చటించారు. ఎక్కడినుంచి వస్తున్నారు.. పధకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. యువతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని పార్టీకి అండగా నిలవాలని కేటీఆర్ సూచించారు.యువతతో ముచ్చ
