Home / 18+ / ఈ ప్ర‌ముఖుల‌ను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?

ఈ ప్ర‌ముఖుల‌ను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?

ఒక‌వైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపిల‌తో పాటు బిజెపి, కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు ఎన్నిక‌ల‌కు రెడీ అంటున్నాయి. మ‌రి ఈ ప‌రిస్ధితుల్లో జ‌న‌సేన ఏం చేస్తోంది ? ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా గ‌ట్టి పేరున్న నేత జ‌న‌సేన‌లో చేర‌లేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్ర‌ముఖుల‌వ‌రైనా చేరారా అంటే అదీలేదు. మ‌రి ఈ ప‌రిస్దితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను జ‌న‌సేన ఏ విధంగా ఎదుర్కోవాల‌ని అనుకుంటోందో అర్ధం కావ‌టం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో చేరింది తూర్పు గోదావ‌రి జిల్లాలోని కందుల దుర్గేష్, పంతం నానాజి, హ‌రిరామ‌జోగ‌య్య‌, ముత్తా గోపాల‌కృష్ణ‌, ముత్తా శ‌శిధ‌ర్ మాత్ర‌మే. వీరిలో గ‌ట్టి నేత‌లెవ‌రంటే ఎవ్వరు సమాధానం చెప్పలేరు.హ‌రిరామ‌జోగ‌య్య‌, ముత్తా గోపాలకృష్ణ ఇద్ద‌రూ అవుడేటెడ్ పొలిటీషన్స్ కాగా వీళ్ళిద్ద‌రినీ జిల్లాలోని జ‌నాలు ఎప్పుడో మర్చిపోయారు. వీరిద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా పార్టీలు మారారు.

ఇక‌, నానాజి, దుర్గేష్ ఇద్ద‌రు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు,వీళ్ళకు కాంగ్రెస్ లో ఉన్నపటినుండి కూడా ఫాలోయింగ్ లేదు. ఇటువంటి ప్ర‌ముఖులు ఇంకా ఎంత‌మంది జ‌న‌సేన‌లో చేరుతారో ఎవరికీ తెలియదు. ఇటువంటి ప్ర‌ముఖుల‌ను పెట్టుకుని ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవాలనుకుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అంతే సంగ‌తులు. ఇక‌, జ‌న‌సేన‌లో చేర‌టానికి 20 మంది ఎంఎల్ఏలు సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్లైన గట్టిపోటీ ఇస్తారా?లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావని తెలిసి జనసేనలోకి జంప్ అవుతున్నారా? అనేది తెలియాలి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat