హరికృష్ణ మరణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హరికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చనిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు.
కాని తమ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రేపటినుండి వీరిద్దరూ తమ సినిమాల షూటింగ్ లలో పాల్గొనున్నారని ఎన్టీఆర్,కల్యాణ్ రామ్‌లు ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.వీరి నిర్ణయాలతో అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’కోసం, కళ్యాణ్ రామ్ దర్శకుడు గుల్హన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారని సమాచారం.