మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్‌ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన మండిపడ్డారు.తన సొంత ఉపయోగాలు కోసం అన్ని పార్టీలతో కలిసి రాష్ట్రాన్ని అమ్మెస్తున్నాడని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్ అని అంబటి చెప్పారు. రేపటి తొమ్మిదో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఊరూ వాడా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైయస్ మరణం ఒక విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కూడా విడిచారని చెప్పారు.ఆ వైయస్ రూపంలో ఇప్పుడు జగన్ మన్నదరి కష్టాలు తీర్చడానికి వస్తున్నాడని అంబటి తెలియజేసార