ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.కాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు త్రినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని, త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.అయితే ఇంత జరిగిన ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం పై ఆయన మండిపడ్డారు.ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాలని,ప్రభుత్వం త్రినాథ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రినాథ్ బంధువు నూకరాజు మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం అందరూ కలసి చిత్తశుద్ధిగా పోరాడాలని కోరారు.