రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తులు తప్పవని అందరికీ తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇక మిగిలింది కాంగ్రెస్ కాబట్టి పొత్తులు పెట్టుకోవటానికి సిద్ధమయ్యారు.
ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే కాంగ్రెస్ తో రాసుకుపూసుకు తిరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధితో సన్నిహితంగా మెలుగుతున్నారు. మొన్నటి రాహూల్ తెలంగాణా పర్యటనలో హైదరాబాద్ లో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హాజరైన విషయం అందరికి తెలిసిందే. మరి ఏపిలో పొత్తు ఉంటే తెలంగాణలో కూడా పొత్తు ఉండాల్సిందే ఎందుకంటే, రెండు పార్టీల పరిస్ధితి రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే విధంగా ఉంది.