అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కాటు వేసిన పామును మళ్లీ అదికారంలోకి తేవాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక విధానాలను ఎండగడుతూ ఈ ప్రశ్న వేశారు.ఆంద్రలో ఎవరైనా చంద్రబాబు మళ్లీ అదికారంలోకి రావాలని అంటారా? అని ఆయన అన్నారు. బీజేపీతో ఆయన ఉంటే ఆ పార్టీ గొప్పదని అంటారని, కాంగ్రెస్ ను ఆయన గొప్పదని అంటే అంతా అనుకోవాలని చెబుతారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్ని అబద్దాలు ఆడినా తాను హరిశ్చంద్రుడిని అని జనం నమ్మాలని చంద్రబాబు భావిస్తారని ఆయన అన్నారు. ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేరని , ఒక్కసారి మోసం చేశారని, మళ్లీ, మళ్లీ మోసం చేయలేరని ప్రజలు మోసపోరని ఆయన అన్నారు. దీంతో జగన్ అన్నది నిజమే కదా అనే అలోచనలో పడ్డారంట.
