టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మహేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా పరుగెడుతుందని, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్ళు వచేసాయని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంది’అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.గౌతమ్ మహేశ్ బాబు నటించిన 1 నేనొక్కిడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఇక గౌతమ్ త్వరలోనే హీరోగా రావడం ఖాయం అని మహేశ్ అభిమానులు చర్చించుకంటున్నారు.అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్ కి సోషల్ మీడియా తరుపున కూడా జన్మదిన శుభాకాంక్షలు.